Breaking News

కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్‌.. స్టోక్స్‌ రియాక్షన్‌ వైరల్‌!

Published on Wed, 06/18/2025 - 14:49

ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్‌ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్‌ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్‌ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్‌ కావడంతో గిల్‌ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్‌ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.

అతడికి ఎవరూ సాటిరారు
ఈ నేపథ్యంలో సిరీస్‌ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ విరాట్‌ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్‌ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్‌ ప్లేయర్‌ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.

ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్‌ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.

18వ నంబర్‌ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్‌ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్‌ ప్లేయర్‌గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్‌ స్టోక్స్‌ పేర్కొన్నాడు.

కోహ్లి ఉంటేనే మజా
అదే విధంగా కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్‌ చేశానన్న స్టోక్స్‌... అతడు లేని టెస్టు క్రికెట్‌ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్‌ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.

మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్‌ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్‌ ప్లేయర్‌’’ అని స్టోక్స్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

దిగ్గజ కెప్టెన్‌ కూడా!
కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌లో.. 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. 

అంతేకాదు.. గ్రేమ్‌ స్మిత్‌ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్‌ (48 విజయాలు), స్టీవ్‌ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీద కెప్టెన్‌గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.

చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఇదే.. రోహిత్‌, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..!

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు