Breaking News

సౌతాఫ్రికాతో టెస్టు.. చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్‌

Published on Wed, 10/28/2026 - 09:03

కేప్‌టౌన్ వేదిక‌గా సౌతాఫ్రికాతో ప్రారంభ‌మైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌లో స్టార్క్ ఆరు వికెట్ల‌తో  చెల‌రేగ‌డంతో సౌతాఫ్రికా 329 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్లు మార్క‌స్ అకెర్‌మ‌న్ (95), ఐడెన్ మార్క‌ర‌మ్ (78), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌ డేవిడ్ బెడింగ్‌హ‌మ్ (50), మార్కో జాన్సెన్ (52) అర్థ‌శ‌త‌కాలు సాధించారు. 

రియాల్ రికిల్‌ట‌న్ (42) రాణించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్టార్క్ 6 వికెట్లు ప‌డ‌గొట్టగా, నాథ‌న్ లియోన్ రెండు, హాజిల్‌వుడ్‌, క‌న్నోలి చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఆట ముగిసేస‌రికి రెండు జ‌ట్లు స‌మానంగా నిలిచాయి. ఒక ద‌శ‌లో 158-0తో ప‌టిష్టంగా క‌నిపించిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆ త‌ర్వాత త‌డ‌బ‌డింది. మొత్తంగా తొలి రెండు సెష‌న్లు సౌతాఫ్రికా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌గా, చివ‌రి సెష‌న్‌లో ఆసీస్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో స‌ఫారీలు ఆలౌట్ అయ్యారు.

స్టార్క్‌ అరుదైన రికార్డు
మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్‌కు 110 టెస్టుల్లో ఇది 20వ ఐదు వికెట్ల హాల్. ఈ నేప‌థ్యంలో స్టార్క్ ఒక అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 20వ సారి ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన రెండో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌల‌ర్‌గా స్టార్క్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గ‌జ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్ (25 సార్లు) తొలి స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

ఓవ‌రాల్ లెఫ్ట్ ఆర్మ్ బౌల‌ర్ల (ఫాస్ట్‌, స్పిన్‌) విభాగంలో స్టార్క్.. న్యూజిలాండ్ దిగ్గ‌జ స్పిన్న‌ర్ డానియ‌ల్ వెటోరితో క‌లిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. లంక స్టార్ స్పిన్న‌ర్ రంగ‌న హెరాత్ (34 సార్లు) జాబితాలో తొలి స్థానంలో ఉండ‌గా, పాక్ లెజెండ్‌ వ‌సీం అక్ర‌మ్ (25 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో ఉన్న‌ బంగ్లా బౌల‌ర్లు ష‌కీబ్ అల్ హ‌స‌న్‌, తైజుల్ ఇస్లామ్ చెరో 19 సార్లు ఈ ఫీట్ న‌మోదు చేశారు.

వార్న్ రికార్డు బ‌ద్ద‌లు
మ్యాచ్‌లో 72 ప‌రుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన స్టార్క్ ప‌నిలో ప‌నిగా ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ రికార్డును కూడా బ‌ద్ద‌లుకొట్టాడు. కేప్‌టౌన్ వేదిక‌లో ఇప్ప‌టివ‌ర‌కు షేన్ వార్న్ బౌలింగ్ (6-161) ప్ర‌ద‌ర్శ‌న‌ అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా స్టార్క్.. వార్న్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టి చ‌రిత్ర సృష్టించాడు. ఇక​ స్టార్క్‌ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి 11 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టాడు. 

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)