Breaking News

సిరాజ్‌ సింహం లాంటోడు.. ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్‌

Published on Fri, 07/18/2025 - 13:43

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్‌ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.

నాలుగో టెస్టు గెలిస్తేనే..
ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్‌ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.

బుమ్రా ఆడేది మూడే
అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్‌లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్‌లో మళ్లీ ఆడాడు.

ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్‌ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

సిరాజ్‌ సింహం లాంటోడు
ఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్‌గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.

అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.

మేమే అతడిని వారిస్తాం
లార్డ్స్‌లో స్టోక్స్‌ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్‌మెంట్‌ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్‌ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.

కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్‌ 24 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్‌బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్‌లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్‌ చేశాడు. 

ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (721.2 ఓవర్లు), పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్‌ చేసిన ఏకైక భారత ఫాస్ట్‌బౌలర్‌ సిరాజ్‌. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్‌ వేదికగా జూలై 23-27 మధ్య భారత్‌- ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు జరుగనుంది.

చదవండి: భారత ఓపెనింగ్‌ జోడీ ప్రపంచ రికార్డు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)