Breaking News

చరిత్రకు అడుగుదూరంలో గిల్‌.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డు!

Published on Wed, 06/17/2026 - 12:58

అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి వ‌న్డే గెలిచిన టీమిండియా రెండో విజ‌యంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా క‌న్నేసింది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో వేదిక‌గా ఇవాళ రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. తొలి వ‌న్డేలో గిల్ త‌ప్పిదంతో ర‌నౌట్ అయిన సీనియ‌ర్ క్రికెట‌ర్, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. 

ఆఫ్గ‌న్‌తో రెండో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ మ‌రో 10 ప‌రుగులు చేస్తే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 14వేల ప‌రుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. వ‌న్డే కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొద‌టి సిరీస్‌. ఇప్ప‌టికే టీమిండియా తొలి వ‌న్డే గెలిచింది. రెండో వ‌న్డేలోనూ గెలిస్తే మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ భార‌త్ వ‌శం కానుంది. 

ఈ క్ర‌మంలో స్వ‌దేశంలో తొలి వ‌న్డే సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా గిల్ నిల‌వ‌నున్నాడు.  ఇక రెండో వ‌న్డేకు కుల్దీప్ యాద‌వ్, జైస్వాల్‌కు చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని ఇప్ప‌టికే గిల్ ప్ర‌క‌టించాడు. ఇక తొలి వ‌న్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ ద‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో టీమిండియా సులువుగానే గెలిచింది. 

అయితే బౌలింగ్ కాస్త బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ విజ‌యంతో ఆ అంశం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. రెండో వ‌న్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్‌), కేఎల్ రాహుల్ (39 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు.

Read: కాన్వేకు ప్రమోషన్‌.. కివీస్‌ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)