Breaking News

చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌

Published on Fri, 10/30/2026 - 13:22

టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ టీ20 క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గిన కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ నిలిచాడు. శ్రేయ‌స్ ఇప్ప‌టివ‌ర‌కు 25 మ్యాచ్‌ల్లో 19 సార్లు టాస్ నెగ్గి తొలి స్థానంలో ఉండ‌గా, వెస్టిండీస్ క్రికెట‌ర్ డారెన్ సామీ, పాక్ ఆట‌గాడు స‌ల్మాన్ అలీ అగాలు కెప్టెన్‌గా తమ తొలి 25 మ్యాచ్‌ల్లో  చెరో 17 సార్లు టాస్ నెగ్గి రెండో స్థానంలో ఉన్నారు.

కాగా శ్రేయస్ తన తొలి 25 మ్యాచ్‌ల్లో ఇన్నిసార్లు టాస్ నెగ్గడం కూడా అతడికి ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. టాస్‌లు గెలిచినట్లే మ్యాచ్‌లు గెలవడంలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు శ్రేయస్ కెప్టెన్‌గా 25 మ్యాచ్‌ల్లో 14 మ్యాచ్‌లు గెలవగా, ఎనిమిదింటిలో ఓటమి చవిచూశాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ టాస్ గెలవడం విశేషం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 6 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (26), ఫిన్‌ అలెన్‌ (12) క్రీజులో ఉన్నారు. అంతకముందు మయాంక్ యాదవ్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (3)తో పాటు డారిల్ మిచెల్ (24) వికెట్లను పడగొట్టి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్‌, మయాంక్ యాదవ్ జట్టులోకి రాగా.. వైభవ్ సూర్యవంశీ, భువనేశ్వర్ కుమార్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు.

 

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)