ODI WC: రోహిత్‌ విఫలం.. ట్విస్ట్‌ ఇచ్చిన గంభీర్‌!

Published on Wed, 07/15/2026 - 16:10

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

రో- కో విఫలం
అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్‌ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.

ప్రయోగాలు చేస్తాం
ఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్‌- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్‌ టాక్‌తో మాట్లాడుతూ రోహిత్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.

ట్విస్ట్‌ ఇచ్చిన గంభీర్‌!
‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్‌ (గంభీర్‌) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.

అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్‌ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్‌ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్‌ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్‌ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.

మేనేజ్‌మెంట్‌కు ఆ విషయం తెలుసు
నిజానికి రోహిత్‌ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ అతడి ప్రతి ఇన్నింగ్స్‌ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. 

రోహిత్‌ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్‌మెంట్‌ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్‌లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్‌మ్యాన్‌కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

కాగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ రోహిత్‌ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్‌.. వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్‌ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)