చరణ్ సరసన సారా..!
Breaking News
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
Published on Mon, 02/16/2026 - 12:25
భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన అభిషేక్.. వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవనే లేదు.
అగ్రస్థానంలో అభిషేక్
పసికూన అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. తాజాగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ఇలా విఫలం కావడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
అయితే, టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లడంతో అభిషేక్ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. లేదంటే అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి అభిషేక్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రవిశాస్త్రి సూచనలు
‘‘అతడి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఆటగాడి కెరీర్‌లో ఇలాంటివి సహజమే. అయితే, ఇందుకోసం ముందుగా అతడు తన పొరపాట్లు సరిచేసుకోవాలి.
క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే.. డాట్ బాల్స్‌ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతడికి కొత్తేమీ కాదు. ఇందుకు అతడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి’’ అని రవిశాస్త్రి అభిషేక్ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. పాక్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సూపర్-8లో అడుగుపెట్టింది.
అంతకు ముందు తొలుత అమెరికా.. అనంతరం నమీబియా జట్లపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చి డకౌట్ అయి నిరాశపరిచాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. కాగా అభిషేక్ శర్మ కెరీర్‌లో ఇదే తొలి వరల్డ్‌కప్ అన్న సంగతి తెలిసిందే.
చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్
Tags : 1