Breaking News

ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్‌కు అమెరికా వార్నింగ్‌

Published on Tue, 02/10/2026 - 12:15

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌-‘ఎ’ నుంచి పాకిస్తాన్‌- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇందుకు వేదిక.

షెడ్యూల్‌ ప్రకారం పాక్‌- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్‌ మొహ్సిన్‌ పాకిస్తాన్‌ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్‌ టోర్నీలో పాక్‌ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. 

ఈసారి కూడా ఓడిస్తాం
పాక్‌తో మ్యాచ్‌కు ముందు మొహమ్మద్‌ మొహ్సిన్‌ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్‌ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే ఈ ప్రపంచకప్‌ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.

మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్‌కప్‌లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్‌ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్‌ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్‌ పాక్‌లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.

సంచలన విజయం 
కాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ లీగ్‌ దశలో అమెరికా పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.

ఫలితంగా మ్యాచ్‌ టై కాగా సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్‌-8కు చేరగా.. పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్‌కప్‌-2026లో సల్మాన్‌ ఆఘా సారథ్యంలోని పాక్‌ నెదర్లాండ్స్‌ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్‌ పటేల్‌ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. 

చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)