Breaking News

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చాడు!.. అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!

Published on Mon, 09/22/2025 - 19:45

ఆసియా కప్‌-2025 టోర్నీలో పాకిస్తాన్‌కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన సూపర్‌- 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో సల్మాన్‌ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్‌హ్యాండ్‌ వివాదం తర్వాత పాక్‌ క్రికెట్‌ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తలుపుతట్టింది.

అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
కాగా లీగ్‌ దశలో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్‌ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్‌.. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ డిమాండ్‌ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్‌ ఆడే మ్యాచ్‌లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్‌ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్‌-4 మ్యాచ్‌లోనూ ఆండీ పైక్రాఫ్ట్‌ రిఫరీగా వ్యవహరించాడు.

క్యాచ్‌ విషయంలో వివాదం
ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్‌లో భారత వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్‌ జమాన్‌.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విషయంలో ఫీల్డ్‌ అంపైర్‌ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్‌ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్‌ అవుట్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్‌ అంపైర్‌ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చాడు!
ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌ సన్నిహిత వర్గాలు టెలికామ్‌ఏసియా.నెట్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ జట్టు మేనేజర్‌ నవీద్‌ చీమా మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.

అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్‌ ఐసీసీకి మెయిల్‌ చేశాడు. అంపైర్‌పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.

ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్‌ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.

చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్‌ బ్యాటర్‌ ఎక్స్‌ట్రాలు

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు