Breaking News

రేపు రెండో వన్డే.. సిరీస్ మొత్తానికి దూరమైన కివీస్ స్టార్‌

Published on Fri, 11/06/2026 - 09:25

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఓటమితో నైరాశ్యంలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కంకషన్(తలకు గాయం)కు గురైన ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తొలి వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కాన్వే టీమిండియాతో వన్డే సిరీస్ మొత్తానికే దూరమైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

గాయపడిన కాన్వే స్థానంలో నిక్ కెల్లీ శనివారం వెల్లింగ్టన్‌లో జరగనున్న రెండో వన్డేకు జట్టుతో కలవనున్నాడని కివీస్ బోర్డు తెలిపింది. కాగా నిక్ కెల్లీ ఇప్పటికే నాలుగు, ఐదు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే కాన్వే దూరమవ్వడంతో రెండో వన్డే నుంచి జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.

అసలేం జరిగిందంటే..
తొలి వన్డే ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కాన్వే, మాట్ హెన్రీ ఫీల్డింగ్ చేస్తూ పరస్పరం ఢీకొన్నారు. ఈ నేపథ్యంలో కాన్వే తలకు బలమైన గాయమయ్యింది. దీంతో కాన్వేను వెంటనే ఆక్లాండ్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కాన్వే గాయంలో తీవ్రత ఉందని, అతడు కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు ధ్రువీకరించారు. 

దీంతో కాన్వే భారత్‌తో వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమైనట్లు కివీస్ బోర్డు ప్రకటించింది. కాన్వే స్థానాన్ని నిక్ కెల్లీతో భర్తీ చేస్తున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం నిక్ కెల్లీ న్యూజిలాండ్‌-ఏ తరఫున భారత్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. జాతీయ జట్టుకు పిలుపు రావడంతో నిక్ కెల్లీ స్థానంలో ఆక్లాండ్ ఏసెస్ బ్యాటర్ డేల్ ఫిలిప్స్‌ను న్యూజిలాండ్‌-ఏ జట్టుకు ఎంపిక చేశారు. 

ఇక ప్రాక్టీస్ సమయంలో కాన్వేను ఢీకొన్న మాట్ హెన్రీ కంకషన్ నుంచి పూర్తిగా కోలుకొని ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ గాయాలతో వన్డే సిరీస్‌కు దూరమవ్వగా, తాజాగా కాన్వే కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు స్టార్ ఆటగాళ్ల ఊహించని షాక్!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)