Breaking News

ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో కప్‌ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Published on Wed, 08/20/2025 - 10:07

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ పెదవి విరిచాడు. రోజురోజుకు మెరుగుపడాల్సి పోయి.. జట్టు తిరోగమనంలో పయనించేలా సెలక్టర్ల నిర్ణయం ఉందంటూ విమర్శించాడు.

ఇలాంటి జట్టుతో ఆసియా కప్‌ గెలిచే అవకాశం ఉంటుందేమో గానీ.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మాత్రం అస్సలు గెలవలేరని చిక్కా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్‌ ఈవెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.

అక్షర్‌పై ‘వేటు’.. గిల్‌ రీ ఎంట్రీ
సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. రీఎంట్రీలో శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా సూర్య డిప్యూటీగా ఉన్న అక్షర్‌ పటేల్‌ (Axar Patel)కు భంగపాటు తప్పలేదు.  మరోవైపు.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. యశస్వి జైస్వాల్‌ను స్టాండ్‌ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు.

సిరాజ్‌కు దక్కని చోటు
ఇక ఈ జట్టులో హైదరాబాదీ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే, యువ ఫాస్ట్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణాతో పాటు.. ఇటీవలి కాలంలో అంతగా ఆకట్టుకోని శివం దూబే, రింకూ సింగ్‌లను కూడా సెలక్టర్లు ఆసియా కప్‌ టోర్నీకి ఎంపిక చేశారు. ఈ పరిణామాలపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించాడు.

ఈ జట్టుతో వరల్డ్‌ కప్‌ గెలవలేరు
‘‘ఈ జట్టుతో మనం మహా అయితే ఆసియా కప్‌ గెలుస్తామేమో!.. కానీ ఇదే జట్టును కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్‌ మాత్రం గెలవలేము. మీరు ఈ జట్టును వరల్డ్‌కప్‌ టోర్నీకి తీసుకెళ్తారా?.. ఐసీసీ టోర్నీకి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మరి మీ సన్నాహకాలు మాత్రం సరైన విధంగా లేవు.

ఎవరైనా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ మీరు జట్టును తిరోగమనంలో పయనించేలా చేస్తున్నారు. అక్షర్‌ పటేల్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారు?.. రింకూ సింగ్‌, శివం దూబే, హర్షిత్‌ రాణాను ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.

ఐపీఎల్‌ ప్రదర్శన మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు ప్రామాణికం అని భావిస్తే.. మరి వీళ్లను ఎలా సెలక్ట్‌ చేసినట్లు?.. అసలు ఈ జట్టులో ఎవరు ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తారు?

ఆ ముగ్గురు ఎందుకు?
వికెట్‌ కీపర్లుగా ఉన్న సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ.. లేదంటే శివం దూబే, రింకూ సింగ్‌లలో ఒకరు ఐదో నంబర్‌ బ్యాటర్‌గా వస్తారా? సాధారణంగా హార్దిక్‌ పాండ్యా ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. ఇక అక్షర్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయలేడు.

మరి ఈ దూబేను ఎందుకు సెలక్ట్‌ చేశారో అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ఇంతకంటే ఇంకేం చేస్తే అతడిని జట్టుకు ఎంపిక చేసేవారు?’’ అంటూ చిక్కా సెలక్టర్ల తీరును ఎండగడుతూ.. ప్రశ్నల వర్షం కురిపించాడు. కాగా చివరగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఐదు మ్యాచ్‌లలో కలిపి 83 పరుగులు చేయగా.. రింకూ రెండు ఇన్నింగ్స్‌ ఆడి 39 రన్స్‌ చేశాడు.

చదవండి: అప్పుడు గిల్‌ లేడు కాబట్టే సంజూ ఓపెనర్‌.. కానీ ఇప్పుడు: అగార్కర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)