Breaking News

అలా అయితే అవుట్‌ అయిపోతావు! గిల్‌కు పంత్‌ వార్నింగ్‌.. వైరల్‌

Published on Sat, 06/21/2025 - 13:17

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్‌తో చెలరేగారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కూడా హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు.

భారీ భాగస్వామ్యాలు
జైసూ 101 పరుగులు సాధించి.. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్‌ 127, పంత్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.  కాగా జైస్వాల్‌ మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (42)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జతచేశాడు.

అనంతరం గిల్‌కు తోడైన పంత్‌ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.

ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్‌ ఎంపిక విషయంలో గిల్‌కు పంత్‌ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ సంధించిన ఫుల్లర్‌ బాల్‌ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్‌.. షార్ట్‌ కవర్‌ దిశగా బాదాడు.

అలా అయితే అవుట్‌ అయిపోతావు!
ఆ సమయంలో నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న పంత్‌.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్‌ అవుట్‌ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్‌ స్టంప్‌లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్‌తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. అతడికి డిప్యూటీగా రిషభ్‌ పంత్‌ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్‌ జరుగుతుండగా.. ఎడ్జ్‌బాస్టన్‌ (బర్మింగ్‌హామ్‌), లార్డ్స్‌ (లండన్‌), ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ (మాంచెస్టర్‌), కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ (లండన్‌) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు
👉షెడ్యూల్‌: జూన్‌ 20- 24
👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
👉టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌
👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).

చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)