Breaking News

సంజూ శాంసన్‌ ధనాధన్‌.. రోహన్‌ విధ్వంసకర సెంచరీ

Published on Thu, 11/27/2025 - 12:51

దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 సీజన్‌లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్‌ గ్రూప్‌-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్‌ సమాల్‌ (14 బంతుల్లో 20), గౌరవ్‌ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.

176 పరుగులు
మిగతా వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్‌ సమంత్రయ్‌ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్‌ ఎస్‌ బరాల్‌ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్‌ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్‌ రెండు, అంకిత్‌ శర్మ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

బౌండరీల వర్షం
ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రోహన్‌ కణ్ణుమ్మల్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు సాధించాడు.

సంజూ ధనాధన్‌.. రోహన్‌ విధ్వంసకర సెంచరీ
మరోవైపు.. రోహన్‌ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్‌ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్‌ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.

ఇదిలా ఉంటే.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్‌ జంటగా సంజూ శాంసన్‌, రోహన్‌ కణ్ణుమ్మల్‌ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

కావాల్సినంత ప్రాక్టీస్‌
కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరకనుంది.

చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)