చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్‌కు ఆర్చర్ స్ట్రోక్‌!

Published on Fri, 07/10/2026 - 17:47

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అలరించిన వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదే జట్టులో సహచరుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సమయంలో వైభవ్‌ను ఔట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలున్నాయని అడిగినప్పుడు, అదేంటనేది ఐపీఎల్ ముగిసిన తర్వాత మీకే తెలుస్తోందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. 

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని జోఫ్రా ఆర్చర్ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను బయటపెట్టుకున్న వైభవ్ ఆర్చర్‌కు దొరికిపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు ఆడలేక వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ చెప్పి మరీ వైభవ్‌కు స్ట్రోక్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్‌లో ఇర‌గ‌దీసిన‌ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఇబ్బంది పడ‌డం వెనుక‌ ప్రధాన కారణం ఇంగ్లండ్‌, ఇండియాలోని పిచ్‌ల మధ్య ఉన్న తేడానే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. 

మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్‌కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్‌లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

 

 

Read: ఒళ్లు మండిన గాఫ్‌.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)