Breaking News

ప‌రుగు తేడాతో ఓట‌మి.. బీసీసీఐకి ఫిర్యాదు

Published on Tue, 10/27/2026 - 11:38

నాగ్‌పూర్‌లో జరిగిన మహిళల అండర్ 19 టోర్నమెంట్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోరింగ్ లోపం కారణంగా జార్ఖండ్ జట్టు పరుగు తేడాతో ఓటమి పాల‌య్యింది. స్కోర్‌బోర్డ్ ఆప‌రేట‌ర్ చేసిన పొర‌పాటు కార‌ణంగా తాము విజ‌యానికి దూరం కావాల్సి వ‌చ్చిందంటూ జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (JSCA) ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని త‌మ‌కు న్యాయం చేయాల‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధికారికంగా ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

విష‌యంలోకి వెళితే..  మ‌హిళ‌ల అండ‌ర్‌-19 టోర్నీలో భాగంగా ఈ నెల 20న జార్ఖండ్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగింది. ఉత్త‌రాఖండ్ విధించిన 134 టార్గెట్‌ను జార్ఖండ్ ఛేదించే ప‌నిలో ప‌డింది.  క్రీజులో లక్ష్మీ కుమారి, ఇషికా భగత్ ఉన్నారు. చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతుల్లో మూడు పరుగులు తీసిన తర్వాత, కుమారి రనౌటయ్యింది. 

అయితే ర‌నౌట్‌కు ముందే సింగిల్ తీసిన‌ప్ప‌టికీ, దానిని స్కోరుబోర్డు ఆప‌రేట‌ర్ పెద్ద‌స్క్రీన్‌పై జ‌త చేయ‌లేదు. అయితే చివ‌రి మూడు బంతుల్లో మూడు ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ, జార్ఖండ్ ప‌రుగు తేడాతో ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. అయితే స్కోర్ ఆప‌రేట‌ర్ చేసిన‌ త‌ప్పిదం వ‌ల్ల ప‌రుగు తేడాతో తాము ఓట‌మిపాలైన‌ట్లు జార్ఖండ్ క్రికెట్ బోర్డు గ‌మ‌నించింది.

ఆ వెంట‌నే ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసింది. తప్పును సరిదిద్దమని జట్టు ప్రధాన స్కోరర్‌ను కోరిన‌ప్ప‌టికీ, నాగ్‌పూర్ స్టేడియం మ్యాచ్ అధికారి మాత్రం త‌న నిర్ణ‌యంపై వెనక్కి తగ్గలేద‌ని జేసీఏ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

స్కోర్‌బోర్డ్‌ను భౌతికంగా ఆపరేట్ చేసే వ్యక్తిపై ఆధారపడకుండా, అధికారిక స్కోరర్ అందించిన సమాచారాన్ని అంపైర్లు తప్పనిసరిగా పాటించాల్సిన అవ‌స‌రముంద‌ని స‌ద‌రు అధికారి బీసీసీఐ ఎదుట వాపోయారు. మ‌రి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: ఇషాన్‌కు గాయం నిజ‌మేనా? అడ్డంగా దొరికిన బీసీసీఐ!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)