Breaking News

కొంప ముంచిన జైస్వాల్‌.. కట్టలు తెంచుకున్న సిరాజ్‌ ఆగ్రహం!

Published on Tue, 06/24/2025 - 19:29

టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (Ben Duckett) శతక్కొట్టాడు. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో.. 122 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా 2010 తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఓపెనింగ్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

చివరగా 2010లో బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌ టెస్టులో అలిస్టర్‌ కుక్‌ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే.. బెన్‌ డకెట్‌కు టెస్టుల్లో ఇది ఆరో శతకం. నిజానికి.. టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్‌ వైఫల్యం కారణంగానే డకెట్‌ సెంచరీ మార్కు అందుకున్నాడని చెప్పవచ్చు.

జైసూ తప్పిదం..
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 39వ ఓవర్లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో ప్రయత్నంలో షార్ట్‌ బంతిని సంధించంగా.. దానిని ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన డకెట్‌.. బంతిని గాల్లోకి లేపాడు. టాప్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి గాల్లో ఉన్న వేళ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన జైస్వాల్‌ క్యాచ్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు.

సిరాజ్‌ ఆగ్రహం
అప్పటికి డకెట్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని అవుట్‌ చేసే అవకాశాన్ని జైసూ జారవిడవడంతో సిరాజ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరోవైపు.. భారత జట్టు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కూడా అసహనానికి లోనయ్యాడు.

కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో జైస్వాల్‌ క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం ఇది నాలుగోసారి. తొలి ఇన్నింగ్స్‌లో మూడుసార్లు ఇదే తరహాలో జైసూ కారణంగా  ప్రత్యర్థి బ్యాటర్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. 

క్యాచ్‌ విన్‌ మ్యాచెస్‌ అంటారు కదా! కానీ జైసూ ఇలా కీలక సమయాల్లో పదే పదే క్యాచ్‌లు మిస్‌ చేయడం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి! ఒకవేళ వీటి కారణంగా మ్యాచ్‌ ఫలితం గనుక తారుమారైతే జైస్వాల్‌పై విమర్శల జడి కురవడం ఖాయం.

వర్షం వల్ల ఆగిన మ్యాచ్‌
ఇక బ్యాటర్‌గా మాత్రం ఈ యువ ఓపెనర్‌ లీడ్స్‌ టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (101) బాదిన జైసూ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నాలుగు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. 

కాగా భారత్‌ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది. మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో 40.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. 

అప్పటికి ఓపెనర్లు డకెట్‌ 105, జాక్‌ క్రాలే 59 పరుగులతో ఉండగా.. ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. విజయానికి భారత్‌ ఇంకా పది వికెట్ల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్‌ గెలుపునకు 190 పరుగులు అవసరం.
UPDATE: Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి

చదవండి: గిల్‌ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్‌!.. ఆఖరికి మేమే గెలిచాం!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)