Breaking News

IND vs WI: టీమిండియాకు భారీ షాక్‌!

Published on Thu, 08/07/2025 - 16:02

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో సత్తా చాటి.. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- tendulkar Trophy) సిరీస్‌ను సమం చేసింది టీమిండియా. రవిచంద్రన్‌ అశ్విన్‌, విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే విదేశీ గడ్డ మీద సత్తా చాటింది. యువ నాయకుడు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్‌ తదుపరి ఆసియా కప్‌-2025 ఆడనుంది.

శుభవార్త.. ఓ చేదు వార్త కూడా..
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నమెంట్‌కు ఆగష్టు చివరి వారంలో బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్‌ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒకే సమయంలో శుభవార్త.. ఓ చేదు వార్త అందాయి.

ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాయపడిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి మాత్రం అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.

విండీస్‌తో రెండు టెస్టులు
ఈ నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ ఆసియా కప్‌-2025తో పాటు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ సెప్టెంబరు 8- 28 వరకు జరుగనుండగా.. స్వదేశంలో విండీస్‌తో అక్టోబరు 2- 14 వరకు టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. అహ్మదాబాద్‌, ఢిల్లీ ఇందుకు వేదికలు

కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ అదరగొట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాదిన ఈ లెఫ్టాండర్‌.. ఓవరాల్‌గా 479 పరుగులు సాధించాడు.

గాయంతోనే..
అయితే, మాంచెస్టర్‌ వేదికగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌షాట్‌కు యత్నించిన పంత్‌.. విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి కుడికాలికి తగలగా పాదం ఉబ్బింది. అనంతరం బొటనవేలు ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. అయినా సరే.. పంత్‌ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: ప్రతోడు సచిన్‌, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)