Breaking News

Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్‌!

Published on Wed, 08/06/2025 - 04:01

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్‌ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్‌ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్‌ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. 

అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్‌ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్  శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌లను ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. 

బిజీ షెడ్యూల్‌ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్‌లను టి20 టీమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ పేరు కూడా టీమ్‌ పరిశీలనలో ఉంది. సుదర్శన్‌ భారత్‌ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్‌ ఆడాడు. 

ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్‌–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్‌కు 17 మందితో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. 

ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్‌ కప్‌ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్‌ గ్రూప్‌’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్‌ల విషయంలో  టోర్నీకి ముంద ఫిట్‌నెస్‌ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)