Breaking News

అద‌ర‌గొడుతున్న పారా అథ్లెట్లు.. ప‌త‌కాల సెంచ‌రీ కొట్టిన భార‌త్‌

Published on Fri, 10/23/2026 - 09:03

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఐదో రోజు భారత్ వంద పతకాల మార్క్‌ను దాటడం విశేషం. భారత అథ్లెట్‌ సందీప్ కుమార్ 400 మీటర్ల T44 ఈవెంట్‌లో 52.28 సెకన్ల మెరుపు వేగంతో స్ప్రింట్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే గాక, స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. 

ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్  అజయ్‌ కుమార్ 53.61 సెకన్ల సమయంలో గమ్యాన్ని చేరి కాంస్యంతో సందీప్‌తో పాటు పోడియంపై నిలిచాడు. పురుషుల సింగిల్స్ SL3 బ్యాడ్మింటన్ ఫైనల్‌లో నితేష్ కుమార్.. ప్రమోద్ భగత్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

పారా ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్, విజయ్ సుండి 5-1 తేడాతో చైనాపై విజయం సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకొని స్వర్ణం చేజెక్కించుకున్నారు. ప్రమోద్ భగత్ రజతం గెలుచుకోగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SU5 ఫైనల్‌లో తులసిమతి మురుగేశన్ 18-21, 11-21 తేడాతో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియాపై , రికర్వ్ మహిళల డబుల్స్‌లో పూజా జాత్యాన్- భావనా ​​చౌదరి 0-6 తేడాతో వాంగ్ జుకియాన్-గావో జిహాన్‌పై గెలుపొందారు.

ఇక పురుషుల 1500మీ T46 ఫైనల్‌లో పర్మోద్ (4:09.65) రెండో స్థానంలో నిలవడం ద్వారా మరో మూడు రజత పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం భారత్ వంద ప‌తకాల మార్క్‌ను అందుకోగా.. ఇందులో 25 స్వ‌ర్ణాలు, 32 ర‌జ‌తాలు, 43 కాంస్యాలున్నాయి. ప‌ట్టిక‌లో భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగుతుంది.

ఇదీ చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్‌ బౌలర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)