Breaking News

తొలి బంతి నుంచే హిట్టింగ్‌ ఆడగలను కానీ..: టీమిండియా స్టార్‌

Published on Wed, 07/22/2026 - 12:00

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌వాష్‌ తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి టీ20 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగ.

ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగానే తాను బ్యాటింగ్‌ చేస్తానని పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని.. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు.

తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాలు
కాగా ఐర్లాండ్‌తో సిరీస్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌ టీ20లలో  ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్‌ వర్మకు వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ లభించింది. అయితే, ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌ చేతుల్లో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్‌స్వీప్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

బ్యాటర్‌గా శ్రేయస్‌ ఫర్వాలేదనిపించినా.. సారథిగా అతడికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు.. తిలక్‌ వర్మ స్లోగా బ్యాటింగ్‌ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడి స్ట్రైక్‌రేటు 110 కాగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 152.94కు చేరినప్పటికీ సగటు 26 మాత్రమే.

ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వంటి మాజీ క్రికెటర్లు తిలక్‌ వర్మను జట్టు నుంచే తొలగించాలనే డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20​కి ముందు తిలక్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది.

ఆ సత్తా నాకుంది.. కానీ
పిచ్‌ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్‌ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం.. తొలి బంతి నుంచే హిట్టింగ్‌ ఆడాలంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్‌ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్‌లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి.

నేను బ్యాటింగ్‌కు వెళ్లేసరికి జట్టు పవర్‌ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్‌ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. 

పోరాటపటిమ ఉన్న జట్టు
గత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్‌లపైనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మేం ఇంగ్లండ్‌కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’’ అని తిలక్‌ వర్మ తనను విమర్శించిన వారికి కౌంటర్‌ ఇచ్చాడు. అదే విధంగా.. జింబాబ్వే మంచి పోరాటపటిమ ఉన్న జట్టు అని ప్రశంసించిన తిలక్‌ వర్మ.. వారిని ఓడించడం కూడా అంత సులువేమీ కాదన్నాడు. 

చదవండి: టీమిండియాపై గెలవగలం: జింబాబ్వే కెప్టెన్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)