ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గిల్‌.. జింబాబ్వే టార్గెట్‌ 183

Published on Wed, 07/10/2024 - 18:12

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. 

రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్‌ (12), రింకూ సింగ్‌ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్‌ భారత్‌ గెలిచిన విషయం తెలిసిందే.

తుది జట్లు..
భారత్‌: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్

జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్‌), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్‌), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)