Breaking News

చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్‌

Published on Thu, 10/02/2025 - 14:19

అహ్మదాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌల‌ర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్‌ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

సిరాజ్‌ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్‌ 2 వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. 

గ్రీవ్స్‌ కాకుండా అలిక్‌ అథనాజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), ఖారీ పియెర్‌ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్‌ క్యాంప్‌బెల్‌ 8, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 8, జోహన్‌ లేన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు. 

ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  

 చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ సిరాజ్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు