ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

Published on Mon, 02/09/2026 - 11:41

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరొందాడు రోహిత్‌ శర్మ. భారత్‌కు 2024లో టీ20 ప్రపంచకప్‌ అందించిన హిట్‌మ్యాన్‌.. 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్‌ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్‌ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో హిట్‌మ్యాన్‌ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్‌ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్‌కప్‌ అంబాసిడర్‌గా నియమించింది.

వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీ
ఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్‌ శర్మ. అమెరికాతో మ్యాచ్‌ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.

అంబానీ కుటుంబం ఆప్యాయత
ఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్‌ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్‌ మ్యాచ్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్‌ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్‌కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.

ముకేశ్‌ అంబానీ స్వయంగా ఛాయ్‌ ఇవ్వగా
అంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్‌తో కూడిన సాసర్‌ను ముకేశ్‌ అంబానీ రోహిత్‌ శర్మకు అందించారు. అయితే, రోహిత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా 2011 నుంచి రోహిత్‌కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్‌ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్‌ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్‌. అయితే, రోహిత్‌ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.

చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)