బుమ్రా అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Published on Mon, 08/03/2026 - 09:47

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యాజమాన్యం అతడికి విశ్రాంతిని పొడగించింది. 

ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ బుమ్రా స్థానంలో ఆకిబ్‌ నబీని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అప్పుడు విమర్శలు
జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన ఆకిబ్‌ నబీ.. గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత రెండు ఎడిషన్లలో కలిపి మొత్తంగా 104 వికెట్లు కూల్చాడు. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.

దీంతో త్వరలోనే ఆకిబ్‌ నబీ టీమిండియాకు ఎంపికవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే, స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఒకేసీజన్లో (2025-26) 60కి పైగా వికెట్లు తీసినప్పటికీ అతడిని పక్కనపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

PC: BCCI X
బుమ్రా గాయం.. నబీకి అదృష్టం
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌-ఎ తరఫునా ఆకిబ్‌ నబీ సత్తా చాటాడు. మొత్తంగా ఆరు వికెట్లు కూల్చాడు. ​కాగా ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే, లంకతో టెస్టు సిరీస్‌ నాటికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు.

కానీ బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో సెలక్టర్లు ఆకిబ్‌ నబీకి మార్గం సుగమం చేశారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్లో భారత్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్‌వాష్‌ చేయక తప్పని పరిస్థితి. 

ఇలాంటి కీలక సిరీస్‌కు అనుభవజ్ఞుడైన బుమ్రా దూరం కాగా.. ఆకిబ్‌ నబీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే, తుదిజట్టులో అతడిని ఆడిస్తారో లేదో చూడాలి! కాగా ఆగష్టు 15- 28 మధ్య శ్రీలంక- టీమిండియా మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటెడ్‌)
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, దేవదత్‌ పడిక్కల్‌, సారాంశ్‌ జైన్‌, ఆకిబ్‌ నబీ.

చదవండి: గిల్‌, అభిషేక్‌ శర్మ కీలక నిర్ణయం!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)