IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్‌.. స్కోరెంతంటే?

Published on Fri, 11/14/2025 - 14:49

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav), అక్షర్‌ పటేల్‌ రాణించడంతో ప్రొటిస్‌ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.

టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 (WTC )సీజన్‌లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో టాస్‌ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  

ఆరంభం నుంచే విజృంభించి
బుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (31), రియాన్‌ రికెల్టన్‌ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. సౌతాఫ్రికా వన్‌డౌన్‌ బ్యాటర్‌ వియాన్‌ ముల్దర్‌ (24)తో పాటు కెప్టెన్‌ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

సౌతాఫ్రికా ఆలౌట్‌.. స్కోరెంతంటే?
ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్‌ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్‌ చేయగా.. వికెట్‌ కీపర్‌ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్‌.. మార్కో యాన్సెన్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఇక స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌.. కార్బిన్‌ బాష్‌ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్‌ దక్కించుకోగా.. సైమన్‌ హార్మర్‌ (5)ను తొమ్మిదో వికెట్‌గా బుమ్రా వెనక్కి పంపాడు.

ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్‌ అయింది.

భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లు
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా 
ఐడెన్ మార్క్రమ్‌, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్‌), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్‌పై కుంబ్లే ఫైర్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)