Breaking News

అది సూర్యకుమార్‌ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్‌ కెప్టెన్‌ ఓవరాక్షన్‌

Published on Sun, 09/28/2025 - 10:13

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌లో లీగ్‌, సూపర్‌-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్‌. తొలుత గ్రూప్‌-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్‌.. తర్వాత సూపర్‌-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

అయితే, సూపర్‌-4లో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్‌ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.

ఫొటోషూట్‌కు వెళ్లని సూర్య
ఇదిలా ఉంటే.. పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్‌ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్‌ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్‌ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.

అది సూర్యకుమార్‌ ఇష్టం
ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్‌ పేర్కొన్నాడు.

గెలిచేది మేమే
ఇక టైటిల్‌ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్‌ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు.

అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్‌లు గెలవలేకపోయాము.

తక్కువ తప్పులు చేసిన వారిదే విజయం
అయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్‌ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్‌ ఆఘా పేర్కొన్నాడు.

కాగా పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్‌-4 మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్‌ ఫిట్‌గానే ఉన్నా.. హార్దిక్‌ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. 

ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్‌ సేననే టైటిల్‌ ఫేవరెట్‌ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్‌ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.

చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)