Breaking News

ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్‌.. గంగూలీ రిప్లై ఇదే

Published on Sat, 06/21/2025 - 12:25

ఇంగ్లండ్‌ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్‌ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.

ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్‌ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్‌ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, గిల్‌, పంత్‌లను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘‘కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌లకు శుభాకాంక్షలు. రిషభ్‌ పంత్‌ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.

ఈరోజు టీమిండియా బ్యాటింగ్‌ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.

ఈరోజు.. యశస్వి, శుబ్‌మన్‌ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్‌ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్‌ చాంప్‌.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్‌ బాగుంది.. పంత్‌.. కరుణ్‌ కూడా శతకాలు బాదుతారేమో!

అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్‌ స్వభావానికి ఇప్పటి వికెట్‌కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్‌ టెండుల్కర్‌ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్‌ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్‌ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్‌ సంజయ్‌ బంగర్‌ 68 రన్స్‌ రాబట్టాడు.

కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. 

దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. రోహిత్‌ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు ఈ సిరీస్‌ ప్రతిష్టాత్మక​ంగా మారింది.

 

చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)