Breaking News

Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి

Published on Tue, 06/24/2025 - 22:58

Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్‌ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.  టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు
బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (42), యశస్వి జైస్వాల్‌ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.

ఆరు పరుగుల ఆధిక్యం
ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జేమీ స్మిత్‌ 40, టెయిలెండర్‌ క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

ఆదుకున్న రాహుల్‌, పంత్‌.. కానీ
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన గిల్‌ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ గిల్‌ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 30 పరుగులు చేశాడు.

ఈ దశలో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (137), రిషభ్‌ పంత్‌ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (4), సిరాజ్‌ (0), బుమ్రా (0), ప్రసిద్‌ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్‌) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది.

శతక్కొట్టిన డకెట్‌
ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్‌ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్‌ నైట్‌ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్‌లో వికెట్‌ నష్టపోకుండా ఆడిన స్టోక్స్‌ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్‌ను పూర్తి చేసింది.

ఓపెనర్లలో జాక్‌ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెన్‌ డకెట్‌ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్‌ (8), హ్యారీ బ్రూక్‌ (0) విఫలమైనా.. జో రూట్‌ (53 నాటౌట్‌), జేమీ స్మిత్‌ (44 నాటౌట్‌) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్‌ స్టోక్స్‌ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్‌ తీయగా.. ప్రసిద్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్‌గా గిల్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- తొలి టెస్టు
🏏షెడ్యూల్‌: జూన్‌ 20- 24
🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 471 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465 ఆలౌట్‌
🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం

🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ లక్ష్యం: 371
🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్‌ బృందం
🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్‌ విజయం

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)