Breaking News

IND vs AFG: ఇషాన్‌ కిషన్‌ ‘ఫాస్టెస్ట్‌’ సెంచరీ

Published on Wed, 06/17/2026 - 15:56

అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు.

టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

జైసూ విఫలం.. పాపం రోహిత్‌
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (4) విఫలం కాగా.. రోహిత్‌ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు.

ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. గిల్‌ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్‌ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్‌ సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 

వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్‌లో ఇక్రామ్‌​ అలిఖిల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

అఫ్గనిస్తాన్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు బాదిన క్రికెటర్లు
1.ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లండ్‌)- 2019లో 57 బంతుల్లో శతకం
2. రోహిత్‌ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం
3. ఇషాన్‌ కిషన్‌ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం
4. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం
5. శుబ్‌మన్‌ గిల్‌ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.

చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్‌పై భారత్‌ భారీ స్కోరు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)