Breaking News

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

Published on Wed, 11/19/2025 - 18:52

2026 పురుషుల అండర్‌ 19 ప్రపంచకప్‌ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్‌ రన్నరప్‌ భారత్‌, యూఎస్‌ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్‌, టాంజానియా, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.

జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్‌-6, సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్‌ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.

గ్రూప్‌లు..
గ్రూప్‌-ఏ- భారత్‌, బంగ్లాదేశ్‌, యూఎస్‌ఏ, న్యూజిలాండ్‌
గ్రూప్‌-బి- జింబాబ్వే, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌
గ్రూప్‌-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, జపాన్‌, శ్రీలంక
గ్రూప్‌-డి- వెస్టిండీస్‌, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా

చదవండి: టీమిండియాకు భంగపాటు

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)