Breaking News

మెస్సీ సేన‌కు ఘ‌న‌స్వాగ‌తం.. కానీ చిన్న ట్విస్ట్‌!

Published on Tue, 07/21/2026 - 14:01

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున మెస్సీ సేన‌ అర్జెంటీనా రాజ‌ధాని బ్యూన‌స్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని ఐజా అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆట‌గాళ్లు, కోచ్‌, స‌హాయ‌క సిబ్బందికి మూడు ప్ర‌త్యేక ఓపెన్‌టాప్‌ బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. 


Phot Credit: FIFA Twitter

ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టు నుంచి సెంట్ర‌ల్ బ్యూనస్ ఎయిర్స్‌కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాల‌నంతగా జనంతో రాజ‌ధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్‌, ర్యాప్ సాంగ్స్‌తో వీధుల‌న్నీ హోరెత్తిపోయాయి. భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆట‌గాళ్లు బ‌స్ క్యాబిన్ డోర్ల‌ను ఓపెన్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చి అభివాదం చేశారు. 

చేతిలో ఫిఫా ట్రోఫీల‌కు బ‌దులు వాళ్లు సాధించిన సిల్వ‌ర్ మెడ‌ల్స్‌, సిల్వ‌ర్ ట్రోఫీల‌ను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవ‌డికి కావాలి.. మీ ఆట‌తో మ‌న‌సులు గెలిచారు అని అభిమానులు త‌మ సందేశాలు వినిపించారు.'క‌మాన్ అర్జెంటీనా' అని నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. 

 


Phot Credit: FIFA Twitter

అర్జెంటీనా సార‌థి లియోన‌ల్ మెస్సీ జట్టుతో ప్ర‌యాణం చేయ‌లేదు. త‌న కుటుంబం కూడా త‌న‌తోనే ఉండ‌డంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంట‌ర్ మియామి క్ల‌బ్ త‌రఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ క్ల‌బ్‌తో జాయిన్ అవ్వ‌నున్నాడు. దీంతో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత మెస్సీ స్వ‌దేశానికి వ‌స్తాడ‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. త‌మ ఆరాధ్య దైవాన్ని లైవ్‌లో చూడాల‌ని ఆశించిన అభిమానుల‌కు భంగ‌పాటు ఎదురైంది. 


Phot Credit: FIFA Twitter

అయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వ‌ర్ బూట్‌ను మాత్రం అభిమానుల‌కు కానుక‌గా జ‌ట్టుతో పాటే పంపించాడు. గోల్‌కీప‌ర్ ఎమిలియో మార్టినేజ్ స‌హా నికోల‌స్ ఒట‌మెండి, మిడ్‌ఫీల్డ‌ర్ లియాండ్రో పరెడెస్‌, అలెక్సిక్‌మాక్ అలిస్ట‌ర్‌, నికోల‌స్ గొంజ‌లెజ్‌, స‌హా అర్జెంటీనా ఆట‌గాళ్లు త‌మ‌ను చూసేందుకు వ‌చ్చిన అభిమానుల‌ను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 


Phot Credit: FIFA Twitter

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగిన అర్జెంటీనా ఫైన‌ల్లో స్పెయిన్ చేతిలో 1-0తో ప‌రాజ‌యం చ‌విచూసింది. ఫెర్నాండేజ్ రెడ్‌కార్డుకు గుర‌వ్వ‌డంతో ప‌ది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్‌ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంత‌టా అర్జెంటీనా జ‌ట్టును త‌న భుజ‌స్కందాల‌పై మోసిన మెస్సీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 

అయితే టోర్నీ ఆసాంతం అసాధార‌ణ ఆట‌ను క‌న‌బ‌రిచిన మెస్సీ 8 గోల్స్‌తో సిల్వ‌ర్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. వ‌చ్చే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ (2030)లో మెస్సీ  ఆడ‌డం అనుమాన‌మే కాబ‌ట్టి త‌మ ఆరాధ్య ఆట‌గాడిని చివ‌రిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాల‌ని ఆశించిన అభిమానుల‌కు మాత్రం నిరాశే ఎదురైంది.

 

Read: అర్జెంటీనా ఓట‌మి.. మెస్సీ భావోద్వేగ లేఖ‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)