తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్‌కు గండం!

Published on Fri, 07/10/2026 - 14:31

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్‌ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది.

అత్యంత చేదు అనుభవం
వరల్డ్‌కప్‌లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్‌ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.

ఇంగ్లండ్‌ పర్యటనలోనూ
ఐర్లాండ్‌ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. ఐరిష్‌ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్‌ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్‌ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.

తీవ్ర స్థాయిలో విమర్శలు
ఈ క్రమంలో ఇంగ్లండ్‌ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.

తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్‌ అయ్యర్‌ సేనతో పాటు.. గంభీర్‌ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వేటు పడుతుందా?
ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. 

కాగా గంభీర్‌ నేతృత్వంలోని కోచింగ్‌ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కొటక్‌, బౌలింగ్‌ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా ర్యాన్‌ టెన్‌ డష్కాటే, ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌ ఉన్నారు.

ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్‌ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్‌ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.

గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే
👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌
👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్‌
👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌ 
👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)
👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్‌
👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత్‌
👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్‌ కోల్పోయిన టీమిండియా
👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.

చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)