Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!

Published on Fri, 02/27/2026 - 18:31

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.

తిలక్‌ ప్రదర్శన ఇలా..
ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్‌ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లపై తిలక్‌ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.

టాపార్డర్‌ నుంచి తీసేశారు!
అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్‌ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.

ఊహించినట్లుగానే టాపార్డర్‌ మారింది. అభిషేక్‌ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్‌ హ్యాండర్‌ సంజూ శాంసన్‌ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్‌ వర్మను లోయర్‌ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.

16 బంతుల్లోనే 
ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్‌ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్‌మెంట్‌ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్‌ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.

డౌన్‌ ఆర్డర్‌కు పంపడం మంచిదైంది
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తిలక్‌ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్‌ వర్మను డౌన్‌ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్‌ ఆర్డర్‌లో అతడు బ్యాటింగ్‌ చేయడం నేను ఇప్పటికే చూశాను.

నిజానికి ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్‌ పాండ్యా ఐదు, తిలక్‌ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. 

ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్‌, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్‌ అవకాశాలు మెరుగుపరచుకుంది.

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)