Breaking News

కివీస్‌తో తొలి వ‌న్డే.. చిక్కుల్లో టీమిండియా స్టార్ బౌల‌ర్‌!

Published on Mon, 11/02/2026 - 12:01

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన టీమిండియా యువ ఫాస్ట్ బౌల‌ర్ గుర్నూర్ బ్రార్ చిక్కుల్లో ప‌డ్డాడు. బుధవారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో సోష‌ల్ మీడియాలో అత‌డి నగ్న చిత్రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం వివాదానికి దారి తీసింది. బాత్‌రూంలో ఒంటిపై నూలు పోగు లేకుండా న‌గ్నంగా అద్దం ముందు నిల‌బ‌డి ప్రైవేట్ పార్ట్స్ క‌నిపించ‌డ‌కుండా ట‌వ‌ల్ అడ్డుపెట్టుకున్న ఫొటోలు సోష‌ల్ మీడియా యాప్‌ స్పాప్‌చాట్‌లో వెలుగు చూశాయి. 

త‌న న్యూడ్ ఫొటోల‌ను స్పాప్‌చాట్‌లో షేర్‌ చేయడంతో పాటు, కొంతమంది అమ్మాయిలను న‌గ్న చిత్రాల‌ను కూడా పంపాల‌ని అడిగిన‌ట్లు సోష‌ల్‌మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డి చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తాజాగా వైర‌ల్‌గా మారాయి. 

ఏఐతో మార్ఫింగ్ చేశారా? 
అయితే ఆ ఫొటోలు నిజంగా గుర్నూర్ బ్రార్‌వేనా లేక ఏఐ సాయంతో మార్ఫింగ్ చేశారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఎవ‌రైనా ఆక‌తాయిలు కావాల‌ని చేశారా లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా చేశారో తెలియ‌దు కానీ, దీనివల్ల క్రికెట‌ర్ గుర్నూర్ బ్రార్ ఇబ్బందుల్లో ప‌డ్డాడు. సోష‌ల్‌మీడియాలో లీకైన త‌న ఫొటోల‌పై అటు గుర్నూర్ బ్రార్ కానీ.. ఇటు బీసీసీఐ కానీ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డంతో క‌చ్చితంగా అవి నకిలీ ఫొటోలే కావొచ్చ‌ని కొంత‌మంది అభిమానులు నిర్థార‌ణ‌కు వ‌స్తున్నారు. 


PC: Twitter

అయితే కొంత‌మంది అభిమానులు మాత్రం గుర్నూర్ బ్రార్‌ను త‌ప్పుబ‌డుతున్నారు. కెరీర్ ఆరంభ ద‌శ‌లో ఉన్న ఒక క్రికెటర్ ఇలాంటి గ‌లీజు ప‌నులు చేయ‌డ‌మేంట‌ని మండిప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హారంలో బీసీసీఐ జోక్యం చేసుకొని గుర్నూర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. అయితే గుర్నూర్ బ్రార్ మ‌న్మీత్ కౌర్ అనే యువ‌తితో ప్రేయాయ‌ణం న‌డుపుతున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. 

ఎవ‌రీ గుర్నూర్ బ్రార్‌? 
గుర్నూర్ బ్రార్ పంజాబ్‌కు చెందిన ఒక ఫాస్ట్ బౌలర్. గుర్నూర్ ఈ ఏడాది జూన్ 13న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే ద్వారా టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు పడగొట్టి ఆక‌ట్టుకున్నాడు. అతను దేశీయ క్రికెట్‌లో కూడా బాగా రాణించాడు. 

2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో పంజాబ్ తరపున ఆడుతూ, అతను ఏడు మ్యాచ్‌లలో 26 వికెట్లు తీశాడు. అతను 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేసింది.  ప్రస్తుత గుర్నూర్ బ్రార్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: అతడిని ఆడించి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)