Breaking News

‘ప్రయోగాలు ఆపండి.. ఆ స్థానంలో అతడు అన్‌ఫిట్‌’

Published on Sat, 11/07/2026 - 15:51

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తున్న సంగతి తెలిసిందే. అయితే కివీస్ పిచ్‌ల‌పై అక్ష‌ర్ ప‌టేల్ పూర్తిగా తేలిపోతున్నాడు. తొలి వ‌న్డేలో డ‌కౌట్ అయిన అక్ష‌ర్ ప‌టేల్ రెండో వ‌న్డేలోనూ 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. 

దీంతో అక్ష‌ర్ ప‌టేల్‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. వ‌న్డేల్లో భార‌త్ త‌ర‌ఫున ఐదో స్థానంలో రెగ్యుల‌ర్‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చే కేఎల్ రాహుల్‌ను కాద‌ని, అక్ష‌ర్ ప‌టేల్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు పంపడంపై భార‌త మాజీ క్రికెట‌ర్ దొడ్డ గ‌ణేశ్ త‌ప్పుబ‌ట్టాడు.  

ఆయన మాట్లాడుతూ.. ‘అక్షర్ ప‌టేల్ వ‌న్డేల్లో ఐదో స్థానంలో స్వ‌దేశంలో బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. కానీ సేనా దేశాల్లో (SENA-సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) బ్యాటింగ్ చేయ‌లేడు. ఐదో స్థానానికి అక్ష‌ర్ అన్‌ఫిట్‌. అత‌డు అప్పుడ‌ప్పుడు మెర‌వ‌గ‌ల‌డే త‌ప్ప సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడ‌లేడు. వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఇప్ప‌టికైనా ప్రయోగాల‌కు సెల‌విచ్చి కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే బాగుంటుంది’’ అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

అక్ష‌ర్ హిట్‌.. రాహుల్ సూప‌ర్‌హిట్‌
ఇక టీమిండియా త‌ర‌ఫున వ‌న్డే క్రికెట్‌లో అక్షర్ పటేల్ ఐదో స్థానంలో 13 సార్లు బ్యాటింగ్‌కు వ‌చ్చి హిట్‌గా మాత్ర‌మే నిలిచాడు. అతను 87.11 స్ట్రైక్ రేట్‌తో, 30.41 సగటుతో 365 పరుగులు చేశాడు. ఇందులో గంభీర్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే 11సార్లు అక్ష‌ర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.  

మరోవైపు, కేఎల్ రాహుల్ మాత్రం ఐదో స్థానంలో సూప‌ర్ హిట్ అయ్యాడు.  ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి రాహుల్‌ నాలుగు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేయ‌డంతో పాటు 68.58 సగటుతో 1646 పరుగులు సాధించాడు. అయితే, గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత రాహుల్ వ‌న్డేల్లో ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. రాహుల్ గత‌ 17 ఇన్నింగ్స్‌లలో 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)