Breaking News

'ఆరోజు బౌండ‌రీ క‌ర్వ్‌గా ఉంది.. లేదంటే ట్రోఫీ మాదే!'

Published on Sat, 10/24/2026 - 09:19

రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆనాటి ఫైన‌ల్లో చివ‌రి ఓవ‌ర్లో పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్ కొట్టిన బంతిని సూర్య‌కుమార్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద  క్యాచ్ అందుకున్న తీరు మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 

మిల్ల‌ర్ ఔట‌వ్వ‌డంతోనే మ్యాచ్ భార‌త్‌వైపు తిరిగింది. ఆ త‌ర్వాతి ఐదు బంతుల్లో 8 ప‌రుగులు రావ‌డంతో సౌతాఫ్రికా విజయానికి ఏడు ప‌రుగుల దూరంలో ఆగిపోయి ర‌న్న‌ర‌ప్‌కే ప‌రిమితమైంది. ఈ టోర్నీ అనంతరం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు విరాట్ కోహ్లి, జ‌డేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికారు.

అయితే నాడు సూర్య‌కుమార్ అందుకున్న‌ క్యాచ్ విష‌యంలో ఒక వివాదం న‌డిచింది. బౌండ‌రీ లైన్ వ‌ద్ద రోప్ క‌ర్వ్‌గా ఉండ‌డంతో సిక్స‌ర్ కాస్తా వికెట్‌గా మారిపోయింద‌ని కొంద‌రు అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. దీనిపై సౌతాఫ్రికా, ఐసీసీ స్పందించ‌లేదు. తాజాగా ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు ఫాఫ్‌ డుప్లెసిస్ మ‌రోసారి ఆ క్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. 

పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ''ఆనాటి ఫైన‌ల్లో సూర్య క్యాచ్ అందుకున్న తీరు అద్భుతం. అయితే బౌండ‌రీ రోప్ కాస్త క‌ర్వ్‌గా ఉండ‌డంతో క్యాచ్ సాధ్య‌మైంది. అలా కాకుంటే మాత్రం అది సిక్స‌ర్‌గా మారి ట్రోఫీ త‌మ‌ ఖాతాలో చేరిపోయేదేమో. ఒక‌వేళ బౌండ‌రీ రోప్ క‌ర్వ్‌గా కాకుండా  సరైన స్థానంలో ఉండి ఉంటే, ఆ షాట్ సిక్సర్ అయ్యేదని దక్షిణాఫ్రికా భావించింది. 

ఆ తాడు కేవలం కొన్ని అంగుళాలు పక్కకు జరిగి ఉంటే,మేము ప్రపంచ కప్ గెలిచి ఉండేవాళ్లం. కానీ ఆరోజు టీమిండియాది. అంద‌రూ చెప్పినట్లుగా.. డబ్బు, పలుకుబడితో ట్రోఫీలను కొనగలిగితే, ఏ ఆటైనా బోరింగ్‌గా ఉంటుంది. ఇలా ఉత్కంఠ మ్యాచ్‌లు జ‌రిగితేనే మ‌జా వ‌స్తుంది. అదే క్రికెట్‌లో ఉండే అందం. క్ష‌ణాల్లో ఫ‌లితాలు తారుమారవుతాయి.'' అని చెప్పుకొచ్చాడు.

నాటి మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. కోహ్లి (76) అర్థ‌సెంచ‌రీ చేయ‌గా, అక్ష‌ర్‌ప‌టేల్ (47), శివ్ దూబే (27) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హరాజ్‌, నోర్ట్జే చెరో 2 వికెట్లు తీశారు. 

అనంత‌రం ఛేద‌న‌లో సౌతాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. క్లాసెన్ (52), డికాక్ (39), స్టబ్స్ (31) రాణించారు. భార‌త బౌల‌ర్లలో పాండ్యా మూడు వికెట్లు తీయ‌గా, బుమ్రా, అర్ష‌దీప్ చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

 

 

ఇదీ చదవండి: 
భార‌త ఆట‌గాళ్లకు ఊహించ‌ని స‌మ‌స్య‌.. క్ష‌ణాల్లో ప‌రిష్కారం!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)