Breaking News

అర్జెంటీనా గెల‌వ‌ద‌ని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫ‌లిస్తుందా?

Published on Sun, 07/19/2026 - 12:20

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో అర్జెంటీనా, స్పెయిన్ త‌ల‌ప‌డుతున్న వేళ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు న‌మోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిల‌బెట్టుకుంటుందంటూ కొంత‌మంది పందేలు కాస్తుంటే.. మ‌రికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయ‌ల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. 

ప్ర‌పంచం మొత్తం బెట్టింగ్‌లు వేసిన‌ప్ప‌టికీ, కెన‌డియ‌న్ రాప‌ర్ డ్రేక్ గ్ర‌హ‌మ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌ట్లు లేదా ఆట‌గాళ్లు ఓడిపోవ‌డం జ‌రిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెల‌వ‌దంటూ డ్రేక్ 1.5 అమెరిక‌న్ మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయ‌లు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.

'డ్రేక్ శాపం' అంటే?
👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.
👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత  ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.
👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అప‌శ‌కునంగా భావిస్తారు.
👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.

లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్‌..
అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. 

ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్ర‌మంలో డ్రేక్ మ‌రోసారి భారీ పందెం కాసిన‌ప్పటికీ ఈసారి కూడా అత‌డి అంచ‌నా తప్పుతుంద‌ని అర్జెంటీనా అభిమానులు బ‌ల్ల‌గుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ న‌మ్మ‌కాన్ని బ‌ద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుంద‌ని పేర్కొన్నారు.

మెస్సీ సేనకు వ్యతిరేకంగా..
ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెల‌వ‌కూడ‌ద‌నే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూ వ‌చ్చాయి. ఆరంభ పోటీల్లో అనామ‌క జ‌ట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మిక‌వేత్త చేసిన ప్ర‌క‌ట‌న వైర‌ల్‌గా మారింది. కానీ రియాల్టీకి వ‌చ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్‌వెర్డెను ఓడించింది. 

ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగిన మ‌రో మూడ‌న‌మ్మ‌కం ఏంటంటే.. ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ఐషో స్పీడ్ తాను మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌తీ జ‌ట్టు టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌డంతో, అత‌డికి అప‌శ‌కునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే క్వార్ట‌ర్ ఫైన‌ల్లో స్విట్జ‌ర్లాండ్‌, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధ‌రించి వారికి మ‌ద్దతు ఇచ్చాడు. 

కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అప‌శ‌కునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క ఫిఫా ఫైన‌ల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Read: ఫిఫా ఫైన‌ల్‌కు ముందు మెస్సీ చివ‌రి సందేశం!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)