Breaking News

జూనియర్‌ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!

Published on Thu, 07/30/2026 - 16:16

హండ్రెడ్ మెన్స్‌ కాంపిటీష‌న్‌లో లండ‌న్ స్పిరిట్ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. బుధ‌వారం ఎంఐ లండ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లండ‌న్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజ‌యం అందుకుంది. మ్యాచ్‌లో ప్రిటోరియ‌స్ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియ‌స్‌తో పాటు జూనియ‌ర్ డివిలియ‌ర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్  కూడా మ్యాచ్‌లో హైలైట్ అని చెప్పొచ్చు.

18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో 37 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్‌లో  డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేస‌కుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచ‌నా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స‌ర్ కొట్టాడు. 

ఈ క్ర‌మంలో బంతి స్టాండ్స్ దిశ‌గా వెళ్తున్న స‌మ‌యంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్క‌సారి కూడా తాను కొట్టిన షాట్‌ను చూడ‌కుండా గ్రౌండ్‌నే చూడ‌డం హైలైట్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్‌కు స‌లాం.. బ్రెవిస్‌*, ఇదెక్క‌డి మాస్ రా మావ‌.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆల‌స్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్‌ను మీరు కూడా వీక్షించండి. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండ‌న్ 100 బంతుల్లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథ‌ర్‌ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండ‌న్ స్పిరిట్ బౌల‌ర్ల‌లో జేమీ ఓవ‌ర్ట‌న్ 3 వికెట్లు తీయ‌గా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం లండ‌న్ స్పిరిట్ మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే మూడు వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప్రిటోరియ‌స్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్‌) భారీ ఇన్నింగ్స్‌ల‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.

 

Read: రహానే రిటైర్మెంట్‌పై బీసీసీఐ తొలి స్పందన

Videos

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)