Breaking News

‘అతడికి అసలు ఆ అర్హత ఉందా?.. ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా?’

Published on Tue, 09/23/2025 - 12:49

పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్‌ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్‌ మైక్‌ హసన్‌ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.

ఆసియా కప్‌-2025 టీ20 టోర్నమెంట్లో భారత్‌ చేతిలో పాక్‌ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో సూర్యకుమార్‌ సేన చేతిలో సల్మాన్‌ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్‌-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు...
దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. భారత్‌ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్‌ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఆఘా బ్యాటింగ్‌ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్‌ స్పందించాడు.

అతడికి అసలు ఆ అర్హత ఉందా?
‘‘జట్టులో బలహీనమైన లింక్‌ ఏదైనా ఉందంటే.. సల్మాన్‌ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్‌లో వీకెస్ట్‌ లింక్‌. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

టీమిండియాతో మ్యాచ్‌లో డౌన్‌లో వస్తాడా? హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?

కోచ్‌ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్‌ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్‌కైనా తెలుసా?’’ అంటూ అక్తర్‌ ఫైర్‌ అయ్యాడు. కాగా ఫైనల్‌ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్‌ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.

చదవండి: IND vs AUS: శ్రేయస్‌ అయ్యర్‌ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)