Breaking News

భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

Published on Thu, 06/11/2026 - 15:37

శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్‌-19 జట్టును ప్రకటించింది. యశ్‌వర్దన్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్‌-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్‌-డే మ్యాచ్‌లు ఆడనుంది.

ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

కొత్త జట్టు
బీసీసీఐ జూనియర్‌ క్రికెట్‌ కమిటీ పంథా మార్చింది. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్‌వర్దన్‌ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.

మరోసారి అన్వయ్‌కు చోటు
గతేడాది నవంబరులో చివరగా అన్వయ్‌ ద్రవిడ్‌ భారత అండర్‌-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 జట్టుతో ఆడిన భారత్‌- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.

బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్‌ ఆడిన అన్వయ్‌.. అఫ్గన్‌ బౌలర్‌ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.

శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 వన్డే జట్టు
సాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్‌ కీపర్‌), అన్వయ్ ద్రవిడ్ (వికెట్‌ కీపర్‌), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్‌ వి, కావ్యా పరేశ్‌ పటేల్‌, మోహిత్‌ ఉల్వా. ఇషాన్‌ సూద్‌.

శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 మల్టీ-డే జట్టు
సాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్దన్‌ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్‌ కీపర్‌), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్‌ కీపర్‌), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్‌, ప్రణవ్‌ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.

భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ శ్రీలంక అండర్‌-19 షెడ్యూల్‌ 
(మూడు వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు)
👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు
👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ
👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్‌ టెస్టు
👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్‌ టెస్టు.

చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)