Breaking News

BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Published on Wed, 12/03/2025 - 17:54

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హార్దిక్‌ రీఎంట్రీ.. రింకూపై వేటు
ఇక వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఫిట్‌నెస్‌ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్‌ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్‌ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.

టెస్టులలో వైట్‌వాష్‌.. వన్డేలలో జోరు
కాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్‌ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్‌ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్‌.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్‌.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా
🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌
🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌
🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌
🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)