Breaking News

Asia cup 2025: పాకిస్తాన్‌ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

Published on Fri, 09/26/2025 - 19:00

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్‌ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (‍Haris Rauf), సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ మ్యాచ్‌లో రౌఫ్‌ ఫీల్డింగ్‌ చేసే సమయంలో విమానం క్రాష్‌ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. 

ఫర్హాన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్‌ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

దీనిపై రౌఫ్‌, ఫర్హాన్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్‌ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్‌ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సూర్యకుమార్‌కు జరిమానా
ఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్‌ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.

ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్‌ దశ, సూపర్‌-4) తలపడిన భారత్‌-పాకిస్తాన్‌.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్‌ పాక్‌ను చిత్తుగా  ఓడించింది. 

చదవండి: సెలెక్ట్‌ చేస్తారని అనుకున్నా.. కరుణ్‌ నాయర్‌ ఆవేదన
 

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు