Breaking News

కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆట‌గాళ్లు.. ఏం జరిగింది?

Published on Mon, 07/20/2026 - 14:44

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 విజేత‌గా స్పెయిన్ అవ‌త‌రించింది. ఆదివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఫైన‌ల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజ‌యం సాధించి రెండోసారి ఫిఫా విశ్వ‌విజేత‌గా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మైదానంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓట‌మి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆట‌గాళ్లు సహ‌నం కోల్పోయి స్పెయిన్ ఆట‌గాళ్ల‌తో గొడ‌వ‌కు దిగారు. 

చిలికి చిలికి గాలి వాన‌లా మారిన గొడ‌వ త‌న్నుకునేంత వ‌ర‌కు వెళ్లింది. దీంతో అప్ప‌టివ‌ర‌కు ర‌ణరంగంలా క‌నిపించిన మైదానం యుద్ధ‌భూమిని త‌ల‌పించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. 

ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డ‌ర్‌ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న‌ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

అయితే ఈ గొడ‌వ‌ను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో  ప‌రెడేస్‌పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆఖ‌రి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘ‌ట‌న‌తో విల‌న్‌గా మారిపోయింది.

 

Read: అర్జెంటీనా గెల‌వ‌ద‌ని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫ‌లిస్తుందా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)