Breaking News

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే

Published on Sat, 01/03/2026 - 09:22

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తమ జట్టు 2026 సీజన్‌లో స్వదేశంలో ఆడే సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. 

షెడ్యూల్‌ ఇదే
సెప్టెంబరు 1, 3, 6లలో వన్డేలు... 9, 12, 13 తేదీల్లో టీ20లు నిర్వహిస్తామని బీసీబీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు, భారత ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన ఎంత వరకు జరుగుతుందనేది చర్చనీయాంశం.

ఒప్పందం ప్రకారం
నిజానికి గత ఏడాది జులైలోనే భారత జట్టు బంగ్లాదేశ్‌ గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే దీనిని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిరవధికంగా వాయిదా వేసింది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్‌ 2026లోగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉంది. 

ప్రస్తుతం ప్రకటించిన టూర్‌ వివరాలు బహుశా వాయిదా పడిన సిరీస్‌ను ఆడటం గురించే కావచ్చని సమాచారం. కాగా బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ షెడ్యూల్‌పై ఎలా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.

బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు
భారత్‌ను రెచ్చగొట్టే విధంగా బంగ్లాదేశ్‌లో కొంతమంది నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం సహా మైనారిటీ హిందూ వర్గంపై దాడుల నేపథ్యంలో.. ఇప్పటికే ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను కొనుగోలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇంతకుమించి దీని గురించి మాట్లాడేందుకు ఏమీలేదు’’ అని దాటవేశాయి.

చాలా సమయం ఉంది 
ఇలాంటి తరుణంలో బీసీబీ ప్రకటించిన షెడ్యూల్‌లో టీమిండియాతో మ్యాచ్‌లు ఉండటం చర్చకు దారితీసింది. సిరీస్‌లకు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. బంగ్లా బోర్డు ప్రకటించిన తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది ఆ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా వెళ్లి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. 

కాగా టీమిండియా జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీ కానుంది. అనంతరం టీ20 వరల్డ్‌కప్‌-2026 బరిలో దిగుతుంది.

చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)