Breaking News

వారెవ్వా టీమ్‌ భారత్‌.. మోదీ జీకి బర్త్‌డే గిఫ్ట్‌! ఎవరీ అందాల సుందరి?

Published on Mon, 09/18/2023 - 10:55

Afghan Mystery Girl- Who Is Wazhma Ayoubi: వజ్మా అయూబీ.. సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు అఫ్గనిస్తాన్‌ ‘మిస్టరీ గర్ల్‌’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆసియా కప్‌-2023 టోర్నీలో టీమిండియాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోందీమె. 

కోహ్లికి వీరాభిమాని
విరాట్‌ కోహ్లికి వీరాభిమాని అయిన వజ్మా.. ఇప్పటికే కింగ్‌ సంతకంతో కూడిన జెర్సీని కూడా దక్కించుకుంది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోగానే ఆ జెర్సీ ధరించి కింగ్‌ రికార్డును సెలబ్రేట్‌ చేసుకుంది.

అంతేకాదు.. పాకిస్తాన్‌ సహా ఇతర జట్లపై టీమిండియా గెలిచినపుడు శుభాకాంక్షలు తెలుపుతూ వజ్మా అభిమానం చాటుకుంది. ఇక ఆదివారం నాటి ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయింది.

సిరాజ్‌ బౌలింగ్‌కు ఫిదా
అంతేకాదు టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌కు ఫిదా అయిపోయింది. మ్యాచ్‌ చూస్తున్నపుడు.. ‘‘11.2 ఓవర్లలో స్కోరు 33-7. కనీవిని ఎరుగని రీతిలో ఇలా ఏడు వికెట్లు పడటం చూశాం. అందులో 6 వికెట్లు మహ్మద్‌ సిరాజ్‌వే! ఈరోజు ఈ మ్యాచ్‌ చరిత్ర సృష్టిస్తుందనడంలో సందేహం లేదు’’ అని వజ్మా అయూబ్‌ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది.

మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌
ఇక రోహిత్‌ సేన ఎనిమిదోసారి ఆసియా కప్‌ ట్రోఫీని ముద్దాడటంతో అద్భుతమైన పోస్ట్‌తో టీమిండియా సహా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులను ఆకట్టుకుంది. ‘‘టీమ్‌ భారత్‌కు శుభాభినందనలు. శ్రీ మోదీ జీకి అదిరిపోయే బర్త్‌డే(సెప్టెంబరు 17) గిఫ్ట్‌ ఇచ్చారు. 

ప్రపంచంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌ అందరికీ కంగ్రాట్స్‌’’ అని వజ్మా విష్‌ చేసింది. ఆమె పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి. థాంక్యూ.. ‘నిజంగా మా లక్కీ ఫ్యాన్‌’ అంటూ ఆమెకు కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎవరీ వజ్మా ఆయుబ్‌?
అఫ్గనిస్తాన్‌లో జన్మించిన వజ్మా ఆయుబి వృత్తిరిత్యా మోడల్‌. దుబాయ్‌లో నివాసం ఉంటున్న ఆమె వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అంతేకాదు సాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు విరాళం అందిస్తూ ఫిలాంత్రపిస్ట్‌గానూ పేరొందింది. 

వజ్మాకు ‘LAMAN’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌ కూడా ఉంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందాలనేది ఆమె చిరకాల కోరిక. అయితే, ఆసియా కప్‌-2023 నుంచి అఫ్గనిస్తాన్‌ నిష్క్రమించిన తర్వాతే వజ్మా తన సెకండ్‌ హోం టీమ్‌ అదేనండి రోహిత్‌ సేనకు ఈ అందాల సుందరి మద్దతు ఇవ్వడం విశేషం.

చదవండి: కాస్త ఓవర్‌ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)