Breaking News

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

Published on Thu, 09/18/2025 - 16:16

నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ (WI vs NEP) క్రికెట్‌ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్‌ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అకీల్‌ హొసేన్‌ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.

కాగా షార్జా వేదికగా వెస్టిండీస్‌ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్‌ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.

ఐదుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు
కెప్టెన్‌ షాయి హోప్‌ (Shai Hope)తో పాటు పేసర్‌ అల్జారీ జోసెఫ్‌, బ్యాటర్‌ జాన్సన్‌ చార్లెస్‌ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్‌ హొసేన్‌ సారథ్యంలో జేసన్‌ హోల్డర్‌,  ఫాబియాన్‌ అలెన్‌, కైల్‌ మేయర్స్‌ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్‌ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్‌ అకీమ్‌ ఆగస్టీ, ఆల్‌రౌండర్‌ నవీన్‌ బిడైసీ, స్పిన్నర్‌ జీషన్‌ మొతారా, పేసర్‌ రామోన్‌ సైమండ్స్‌, కీపర్‌ అమీర్‌ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.

నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు
అకీల్‌ హొసేన్‌ (కెప్టెన్‌), ఫాబియాన్‌ అలెన్‌, జువెల్‌ ఆండ్రూ, అకీమ్‌ ఆగస్టీ, నవీన్‌ బిడైసీ, జెడియా బ్లేడ్‌, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్‌ హోల్డర్‌, అమీర్‌ జాంగూ, కైల్‌ మేయర్స్‌, ఒబెడ్‌ మెకాయ్‌, జీషన్‌ మొతారా, రామోన్‌ సైమండ్స్‌, షమార్‌ స్ప్రింగర్‌.

ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు భారత పర్యటన‌కు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్‌ తమ జట్టు వివరాలను వెల్లడించింది.

టీమిండియాతో టెస్టులకు విండీస్‌ జట్టు వివరాలు
రోస్టన్‌ ఛేజ్‌ (కెప్టెన్‌), తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్, బ్రెండన్‌ కింగ్, కెవ్‌లాన్‌ అండర్సన్, షై హోప్, జాన్‌ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్‌లాక్, గ్రీవ్స్, అండర్సన్‌ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్‌ జోసెఫ్, జేడెన్‌ సీల్స్, ఖారీ పైర్, జోమెల్‌ వారికాన్‌. 

చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)