టెస్టు క్రికెట్‌ చ‌రిత్ర‌లో తొలిసారి.. విండీస్ బౌల‌ర్ ప్రపంచ రికార్డు

Published on Tue, 07/28/2026 - 08:38

వెస్టిండీస్ క్రికెట‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా 5 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా జ‌స్టిన్ గ్రీవ్స్ రికార్డుల‌కెక్కాడు. గ్రీవ్స్ త‌న తొలి ఆరు ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. 

అయితే మ‌లి విడ‌త బౌలింగ్‌కు వ‌చ్చిన గ్రీవ్స్ తాను వేసిన వ‌రుస 5 ఓవ‌ర్ల‌లో ఓవ‌ర్‌కు ఒక్కో వికెట్ చొప్పున ఐదు వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలోనే ఆ ఐదు ఓవ‌ర్ల‌లో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా మెయిడెన్లు న‌మోదు చేయ‌డం విశేషం. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో 5 వికెట్లు తీసే క్ర‌మంలో ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా ఈ ఘ‌న‌త సాధించిన తొలి క్రికెట‌ర్‌గా జ‌స్టిన్ గ్రీవ్స్ నిలిచాడు. 

ఒక ద‌శ‌లో మ్యాచ్ పాకిస్తాన్‌వైపు మొaగ్గు చూపింద‌ని అంతా భావించ‌గా, రెండో స్పెల్ బౌలింగ్‌కు వ‌చ్చిన జ‌స్టిన్ గ్రీవ్స్ త‌న అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తిప్పేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో 3 వికెట్ల న‌ష్టానికి 244 ప‌రుగుల‌తో మంచి ప‌ట్టు సాధించిన పాకిస్తాన్‌కు గ్రీవ్స్ చుక్కలు చూపించాడు. త‌న వ‌రుస ఐదు ఓవ‌ర్ల‌లో పాక్ బ్యాట‌ర్లు షాన్ మ‌సూద్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, అలీ ఉస్మాన్‌, ఆమిర్ జ‌మాల్‌, మ‌హ్మ‌ద్ అబ్బాస్‌లను పెవిలియ‌న్ చేర్చాడు. 

జ‌స్టిన్ గ్రీవ్స్‌కు టెస్టుల్లో ఇదే తొలి ఐదు వికెట్లు ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం. గ్రీవ్స్ దెబ్బ‌కు భారీ స్కోరు చేస్తుంద‌నుకున్న పాకిస్తాన్ 282 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మూడు వికెట్ల న‌ష్టానికి 244 ప‌రుగుల‌తో పటిష్టంగా క‌నిపించిన పాక్ త‌న చివ‌రి ఏడు వికెట్లను 38 ప‌రుగుల‌తో చేజార్చుకోవ‌డం విశేషం. 

మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 126 ప‌రుగులు చేసింది. కీమ‌ర్ రోచ్ (5), ష‌మ‌ర్ జోసెఫ్ (22) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం విండీస్ 155 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై విజ‌యం ఎవ‌రిద‌నేది ఆస‌క్తిగా మారింది.

 

Read: రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్‌!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)