తీరు మారని టీడీపీ: వైఎస్‌ జగన్‌

Published on Sun, 10/06/2024 - 05:02

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ లడ్డూ ప్రసాదం విషయంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆక్షేపించారు. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్‌ చేస్తూ శనివారం ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

ఆ వీడియోలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్‌ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్‌డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్‌ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. 

ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్‌ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్‌ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన వ్యాఖ్యానించింది అని చెప్పారు.  
 

ఈవో, సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు
‘ఎఫ్‌ఐఆర్‌ సెప్టెంబరు 25న రిజిస్టర్‌ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సిట్‌ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే మళ్లీ ఇవాళ కూడా.. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. 
 


 

బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి ఇద్దరు రాష్ట్ర అధికారులు.. వీరికి తోడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామి వారిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదు’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.    

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)