Breaking News

ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరు

Published on Fri, 01/27/2023 - 18:51

తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రాయోజిత కార్యక్రమం అన్నారు పేర్ని నాని. నందమూరి వారసులను చూసి చంద్రబాబా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం సభలో లోకేష్ బరితెగించి అబద్దాలు మాట్లాడాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు బజారున పడ్డారని ప్రశ్నించారు. తెలుగుదేశాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు చెత్తనాయకుడని అ‍చ్చన్నాయుడే చెబుతున్నాడని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పెన్షన్లు తీసేశారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 40 లక్షల పెన్షన్లు వస్తే.. సీఎం వైఎస్ జగన్ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు.

కొత్త వైన్ బ్రాండులన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని పేర్ని గుర్తు చేశారు. చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. చంద్రబాబు పెట్టిన 22వేల కోట్ల కరెంటు బకాయిల భారాన్ని ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు 100 అబద్దాలు చెబితే లోకేష్ 1000 చెబుతున్నారని విమర్శించారు.

జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ము టీడీపీకి ఉందా? అని పేర్ని సవాల్ విసిరారు. తెలుగు గంగను పూర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గు లేదా? అని ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. టీడీపీ నేతలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరని పేర్ని వ్యాఖ్యానించారు.
చదవండి: పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)