Breaking News

‘తల్లికి వందనం.. లోకేష్‌ తనకు తానే సవాల్‌ విసురుకున్నాడు’

Published on Mon, 06/16/2025 - 13:49

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు  తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్‌ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు  తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.

చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్‌ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.

Malladi Vishnu: జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం

డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్‌ జగన్‌ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్‌ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు  తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)